Thursday, January 5, 2017

సీతా కళ్యాణ వైభోగమే....

అందరికీ నమస్సులు. వైవాహిక బంధం అనగానే వెంటనే గుర్తొచ్చేది సీతారాములే.
ప్రపంచంలో ఇంకెక్కడా కనిపించనంత గొప్పగా అల్లుకున్న భారతీయ వివాహ బంధం ఆదర్శవంతమైనది.
పెళ్లి అంటే మూడు ముళ్లు మాత్రమే కాదు.. సుఖాల్లోనూ, కష్టాల్లోను ఒకరికొకరు తోడుండాలన్న సత్యాన్ని
సీతారాముల కథ చెప్తుంది. అందుకే యుగాలు గడిచినా ఇప్పటికీ వివాహం అంటే సీతారామ కళ్యాణ వైభోగమే.
అలనాటి సీతారాముల కళ్యాణ వైభోగాన్ని త్యాగరాజ స్వామి వారు వర్ణించిన తీరు మహాద్భుతం.
ఏ పెళ్లిలోనైనా ఈ పాట వినిపిస్తేనే నిండుదనం. అందుకే పూర్తి సాహిత్యంతో... సుస్వరాలతో ఈ పాట
మీకోసం. వినండి...  ఎంత కష్టమైనా ఇట్టే తేలికైపోతుంది. 

Tuesday, January 3, 2017

మన హనుమేనే సూపర్ మేన్‌....

ఈ ఆంజనేయ రక్షా శ్లోకాన్ని రోజూ రాత్రి పడుకునే ముందు పిల్లలకు వినిపించండివారికి నేర్పించండిసైకలాజికల్ గా భయాన్ని హరించే మంత్రమిదిహనుమంతుడుని తలుచుకుంటే భయం పోతుందా౟??.. అవును పోతుందినొప్పులకు మందులుంటాయిఅలాగే మనసుని చెదరగొట్టే ఫీలింగ్స్ కి సైకాలజీనే మందుమన భారతీయ ఆధ్యాత్మికతలో శ్లోకాలన్నిటిలో సైకాలజీ ఉంటుందివ్యక్తిత్వ వికాసం ఉంటుందికొన్ని మంత్రాలు పఠించడం వల్ల... శరీరంలో కలిగే కదలికలు... నేరుగా మెదడునిమన భయాలని కంట్రోల్ చేస్తాయి.భయాన్ని పోగొట్టే మందేదీ లేదుకానీ... ఆంజనేయస్వామిని చూస్తే పిల్లల్లో భయం పోతుందిఅంటే... భయానికి మందు హనుమంతుడేజై బజరంగ్ భళీ అంటారునిజానికి ఇది వజ్రాంగ వళివజ్రం లాంటి శరీరం కలవాడని అర్థంబెంగాలీ వారు వ బదులు బ పలుకుతారు కాబట్టి బజ్రంగ్ అయిందిఇదే కాన్సెప్ట్ తో హాలీవుడ్ వారు మన హనుమంతుడినే సూపర్ మేన్ అంటే ఐమాక్స్ లో చూస్తాంగరుత్మండుడి స్టోరీనే బ్యాట్ మేన్ అంటో ఆహో ఓహో అంటాంకానీఆంజనేయ శ్లోకం చదివితే భయం పోతుందంటే... లాజిక్కులు వెదికే పనిలో పడతారు కొందరుహనుమంతుడు అంటేనే ధైర్యానికి ప్రతిరూపంపిల్లల్లో మానసికంగా ధైర్యం నింపే దైవ స్వరూపం ఆంజనేయుడుమా మీడియా నుంచి వచ్చిన మరో ఆధ్యాత్మిక శ్లోకం ఆంజనేయ రక్షను వినండి.. పఠించండి.

Thursday, December 8, 2016

అందరికీ నమస్కారం....



నేను చాలా ఏళ్లుగా మీ అందరి అభిమానం చూసిన బ్లాగర్‌నే. మెరుపు... అనే బ్లాగ్‌తో మీ అందరు ా నా పోస్ట్‌లను ఆదరించారు. అయితే చాలా రోజులుగా నేను బ్లాగ్‌కి దూరంగా ఉన్నాను. సొంతగా ఒక ప్రొడక్షన్‌ హౌస్‌ స్టార్ట్‌ చేసే క్రమంలో ఆ బిజీలో పడి పోస్ట్‌లు పెట్టలేదు. ఇప్పుడు ప్రొడక్షన్‌ హౌస్‌ స్టార్ట్‌ చేశాం. ముందుగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించాం. చిన్నపిల్లలకు అవసరమైన శ్లోకాలు వాటి అర్థాలు, ఇంకా ఇతర డెవోషనల్‌ కంటెంట్‌ని ప్రారంభించాం. ఇకపై బ్లాగ్‌లో రెగ్యులర్‌గా  కనిపిస్తాను. అయితే బ్లాగ్‌ అడ్రస్‌ మార్చాను. అందువల్ల... దయచేసి ఈ బ్లాగ్‌ అడ్రస్‌ నుంచి  నా పోస్ట్‌లు వస్తాయి . ఎప్పటిలాగే మీ ఆదరాభిమానాలు ఉంటాయని ఆశిస్తూ.... సతీష్‌ కొత్తూరి.



http://aadyanmedia.blogspot.in/